మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై మనసు పారేసుకుంది.. మిస్ వరల్డ్ మానుషి చిల్లర్. చరణ్ డేట్ కి వెళ్లాలని.. అతడిని పెళ్లి చేసుకోవాలని , ఉంది. కానీ చరణ్ కి పెళ్లి కావడంతో అవన్నీ తీరే కోరికలు కావని తనని సముదాయించుకుంది. మిస్ వరల్డ్ కిరీటం తెచ్చిపెట్టిన ఆరో భారత అందం మానుషి చిల్లర్. 2017లో మిస్ వరల్డ్ విజేతగా నిలిచింది. 'పృధ్వీరాజ్' సినిమాతో మానుషి చిల్లర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇదో హిస్టారికల్ యాక్షన్, డ్రామా. రేపే (జూన్ 3) ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్షయ్ కుమార్ తో కలిసి ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న , చిల్లర్.. రామ్ చరణ్ పై ఇన్నాళ్లు దాచుకున్న ప్రేమను బయటపెట్టింది. మానుషి చిల్లర్ కామెంట్స్ ను మెగా అభిమానులు మస్త్ గా ఎంజాయ్ చేస్తున్నారు.