టాలీవుడ్ విలక్షణ నటుడు రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా, వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. సురేష్ బొబ్బిలి సంగీత దర్శకత్వం వహించిన ఈ మూవీ, ఎన్నో ఆసక్తికర పరిణామాల అనంతరం జూన్ 17న విడుదల కానుంది. విడుదలకింకా రెండు వారాల సమయమే ఉండటంతో చిత్రబృందం మ్యూజికల్ అప్డేట్స్ తో ప్రమోషన్స్ ప్రారంభించింది. ఈ క్రమంలో నగా దారిలో అనే లిరికల్ సాంగ్ ను ఈ రోజు విడుదల చేసింది. రానా రచనలను అమితంగా ఇష్టపడే సాయిపల్లవి అతన్ని వెతుక్కుంటూ అడవికి వెళ్తుంది. అడవి వెళ్లిన తర్వాత రానాకు, సాయి పల్లవికి మధ్య నడిచే అందమైన ప్రేమ గీతంగా, ఎంతో సున్నితంగా ఉంది. ఈ పాటకు సాహిత్యాన్ని ద్యావారి నరేందర్ రెడ్డి, సనాపతి భరద్వాజ్ పాత్రుడు అందించారు. వరం గొంతు ఈ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa