చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రస్తుత కాలంలో ప్రతి సినిమా విడుదలైన నాలుగు వారాల్లో ఓటిటిలో ప్రత్యక్షమౌతుంది. దీంతో ధియేటర్లకెందుకులే వెళ్లడం..ఎలాగూ ఓటిటిలోకి వచేస్తుందిగా అప్పుడు చూద్దాంలే అని చాలా మంది అనుకుంటున్నారు. ఇలాంటి ఆడియన్స్ కి షాక్ ఇస్తూ అనిల్ అండ్ టీం ఎఫ్ 3 డిజిటల్ ఎంట్రీ ఇప్పట్లో లేదని తేల్చి చెప్పేసారు. ఈ మేరకు అనిల్, వెంకటేష్, వరుణ్ తేజ్ లు ఎఫ్ 3 డిజిటల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఎనిమిది వారాలు అంటే రెండు నెలల తర్వాతే ఎఫ్ 3 మూవీ ఓటిటిలోకి వస్తుందని చెప్పారు. సో... ఆడియన్స్ ఎఫ్ 3 నవ్వుల పువ్వుల కోసం థియేటర్లకు వెళ్లాల్సిందే. ప్రతి ఒక్క ప్రేక్షకుడిని థియేటర్లకు రప్పించాలన్న ఉద్దేశంతో టికెట్ రేట్లను ఏమాత్రం పెంచకుండా, సాధారణ రేట్లతోనే అందుబాటులోకి వచ్చిన చిత్రం ఎఫ్ 3. ఇలాంటి ఉద్దేశంతో థియేటర్లకు వచ్చిన ఎఫ్ 3ని మొబైల్ లో చూసి నవ్వుకునే కన్నా థియేటర్లకు వెళ్లి నలుగురితో కలిసి ఎంజాయ్ చేస్తే నవ్వులు మరింత పెరుగుతాయి. ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ అమాంతం తగ్గిపోతాయి.
అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఎఫ్ 2 కు సీక్వెల్ గా తెరకెక్కిన ఎఫ్ 3 లో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ లు ప్రధాన పాత్రలు పోషించారు. DSP సంగీతం అందించగా, దిల్ రాజు నిర్మించారు.