భారతీయ సినీ చరిత్రలో కన్నడ చిత్ర పరిశ్రమను సగర్వంగా నిలిపిన చిత్రం కేజీఎఫ్ 2. హై ఇంటెన్స్ మాస్ యాక్షన్ మూవీకి బలమైన తల్లి సెంటిమెంటును జోడించి దర్శకుడు ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా హిట్టును గట్టిగానే కొట్టాడు. ఏప్రిల్ 14న విడుదలైన ఈ చిత్రం తొలిరోజు నుండి వసూళ్ల సునామీని సృష్టిస్తూ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఒక రేంజులో దూసుకుపోతుంది. తెలుగు, హిందీ, కన్నడ అనే భాషా భేషజాలకు తావు లేకుండా అన్ని ప్రాంతాల వారు ఈ సినిమాకు బ్రహ్మరధం పడుతున్నారు. ఇటీవలే థియేటర్లలో యాభై రోజులను పూర్తి చేసుకున్న కేజీఎఫ్ 2 చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ఈసారి ఎలాంటి డబ్బులు కట్టనవసర్లేదు. కొన్నిరోజుల కిందట పే పర్ వ్యూ పద్దతిలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ఐన కేజీఎఫ్ ను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. థియేటర్లో చూసే అవకాశముండి ఓటిటిలో డబ్బులు పెట్టి చూడటాన్ని సబ్ స్క్రైబర్లు ఆదరించలేదు. నేటినుండి అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఉచితంగా స్ట్రీమింగ్ అవుతున్న కేజీఎఫ్ ను ఇకపై ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు చూడొచ్చు. థియేటర్లో దుమ్ము రేపిన రాఖీభాయ్ ఓటిటిలో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.