తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. 'వరం', 'బ్యాచిలర్స్' అనే సినిమాల్లో కథానాయకుడిగా నటించిన సత్య గుండెపోటుతో కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీ కెరీర్ ప్రారంభించిన సత్య ‘వరం’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత 'బ్యాచిలర్' సినిమాలో నటించాడు. సత్య భార్య, తల్లి ఇద్దరూ గతేడాది చనిపోయారు. దాంతో సత్య మానసికంగా కుంగిపోయాడు. ఆయన మృతి పట్ల బంధువులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.