సామ్ రైమి దర్శకత్వం వహించిన సినిమా 'డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్'. ఈ సినిమాని మార్వెల్ సంస్థ నిర్మించింది.ఈ సినిమా మే 6న విడుదలై భారీ కలెక్షన్లను రాబట్టింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో ప్రసారం కానుంది. ప్రముఖ ఓటిటి సంస్థ డిస్నీ + హాట్‌స్టార్ లో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ మరియు ఆంగ్లంలో భాషలో ఈ సినిమా జూన్ 22 నుండి స్ట్రీమింగ్ కానుంది.