లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి నటించిన "విక్రమ్" సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. కాళిదాస్ జయరామ్, నరైన్, అర్జున్ దాస్ అండ్ శివాని నారాయణన్ సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. తాజా రిపోర్ట్స్ ప్రకారం, విక్రమ్ సినిమా న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియాలో 2022లో 2వ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమా న్యూజిలాండ్ బాక్సాఫీస్ వద్ద మొదటి రోజున NZ$27,204 వసూలు చేయగా, ఆస్ట్రేలియా బాక్స్ఆఫీస్ వద్ద ఈ చిత్రం A$233,754 సంపాదించింది. ఇండస్ట్రీ ట్రాకర్ రమేష్ బాలా ఇదే విషయాన్ని ట్వీట్ చేసి ప్రకటించారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అతిధి పాత్రలో కనిపించనున్నాడు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ అండ్ ఆర్ మహేంద్రన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.