టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన అప్కమింగ్ మూవీ 'గాడ్ ఫాదర్' షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా, ఈ స్టార్ హీరో చాలా సినిమాలకి సైన్ చేసారు. దర్శకుడు వెంకీ కుడుములతో మెగా స్టార్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఇంకా ప్రారంభం కాని ఈ సినిమా ఆగిపోయిందని గత కొన్ని రోజుల నుండి వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, ఇటీవల స్టార్ హీరో కమల్ హాసన్‌తో జరిగిన ఇంటరాక్షన్‌లో, ఈ యువ దర్శకుడు ప్రాజెక్ట్ ఇంకా కొనసాగుతుందని వెల్లడించారు. ఆ ఇంటర్వ్యూలో ఈ సినిమా పై వచ్చిన రుమోర్స్ కి క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది అని సమాచారం. మూవీ మేకర్స్ ఇంకా ఈ సినిమాకి టైటిల్ ని లాక్ చేయలేదు. చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న షూటింగ్‌లను పూర్తి చేసిన తర్వాత ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది అని సమాచారం. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa