టాలీవుడ్ యంగ్ అండ్ గ్లామరస్ బ్యూటీ లావణ్య త్రిపాఠి వెండితెరపై కనబడి చాలా రోజులైపోతుంది. ఈ నేపథ్యంలో లావణ్య ఒక విభిన్నమైన సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మత్తువదలరా సినిమాతో టాలీవుడ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా నిలిచిన రితేష్ రానా డైరెక్షన్లో రూపొందిన "హ్యాపీ బర్త్ డే" సినిమాలో లావణ్య త్రిపాఠి మెయిన్ లీడ్ పోషిస్తుంది. నిన్న రెడ్ అలెర్ట్ పోస్టర్ తో అందరిని అలెర్ట్ చేసిన టీం ఈ రోజు టీజర్ ను విడుదల చేసింది. టీజర్ ఆద్యంతం వినోదభరితంగా సాగింది. అలానే ఏం జరుగుతుందో అనే ఉత్కంఠను రేకెత్తించింది. గన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి జీవో జారీచెయ్యాలని వెన్నెల కిషోర్ పోరాడుతూ ఉంటాడు. ఈ జీవో పాసైన తర్వాత ప్రతి ఒక్కరి చేతిలో తుపాకీ, వీధికొక తుపాకిలు అమ్మే కొట్టు ఏర్పడతాయి. నో గన్ నో ఎంట్రీ అనే కోడ్ తో లావణ్య బర్త్ డే పార్టీ చేసుకుంటుంది. ఈ పార్టీలోకి కొంతమంది కమాండోలు వచ్చి బుల్లెట్ల వర్షం కురిపిస్తారు. చివరాఖరిలో అసలు గన్ బిల్లును తీసుకురావాలన్న ఆలోచన మీకెందుకు వచ్చింది అనే ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు వెన్నెల కిషోర్ ఇచ్చిన పంచ్ కడుపుబ్బా నవ్విస్తుంది. కాలభైరవ అందించిన మ్యూజిక్, BGM సన్నివేశాలకు సరిగ్గా సింక్ అయ్యాయి. క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ , మైత్రి మూవీ మేకర్స్ సంయక్తంగా నిర్మించిన ఈ సినిమా జూలై 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.