నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం NBK#107 సినిమాలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న చిత్రమిదే. ఇందులో శృతి హాసన్ హీరోయిన్. ఇంకా టైటిల్ ఖరారు చెయ్యని ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ అంతిమదశకు చేరుకున్న ఈ మూవీ పూర్తైన వెంటనే బాలయ్య వినోదభరిత చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తో తన 108వ సినిమాను చెయ్యనున్నారు.
వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా కావటంతో ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా నుండి అప్డేట్ లు కూడా వస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన బాలయ్య రగ్డ్ లుక్ కు ప్రేక్షకుల నుండి విపరీతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ పోస్టర్ ను ఈరోజు చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా విడుదల చేసారు. బాలయ్య రెండు చేతులను వెనక్కి పట్టుకుని ఉంటారు. ఈ చేతులను మాత్రమే చూపిస్తూ ఫస్ట్ హంట్ లోడింగ్ అని క్యాప్షన్ ఇచ్చారు. జూన్ 10న బాలయ్య పుట్టినరోజును పురస్కరించుకుని ఈ రోజునుంచే చిత్రబృందం ఆసక్తికర అప్డేట్ లనివ్వడంతో నందమూరి అభిమానులు ఖుషి అవుతున్నారు.