టాలీవుడ్ సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ ఆచార్యతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ను చవిచూశారు. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ను ఒకేసారి డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ అందుకున్న కొరటాల ఘోరాతిఘోరంగా విఫలమయ్యాడు. ఆచార్య కనీసం మెగా అభిమానులకు కూడా నచ్చలేదంటే ఎంతటి భారీ డిజాస్టరో అర్ధం చేసుకోండి. దీంతో ఆచార్య డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర నష్టాల్లోకి మునిగిపోయారు. కొంతలోకొంతైనా తమకు సెటిల్ చెయ్యమని గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ కొరటాల శివ, ఇటీవలే ఇండియాకి తిరిగొచ్చిన చిరుతో కలిసి డిస్టిబ్యూటర్ల సమస్యలను ఒక కొలిక్కి తీసుకువచ్చినట్టు సమాచారం.
ఆచార్య సినిమాకు డైరెక్షన్ మాత్రమే కాక బిజినెస్ విషయంలోనూ కొరటాల చురుగ్గా పాల్గొన్నారని తెలుస్తుంది. లాభనష్టాలను ముందునుంచి బేరీజు వేసుకున్న కొరటాల ఇప్పుడు ఫైనల్ సెటిల్మెంట్ కూడా చేసేశారని వినికిడి. డిస్ట్రిబ్యూటర్స్ కు 33 కోట్లు చెల్లించాలని లెక్క తేల్చారంట. ఈ మొత్తంలో చాలావరకు ఇప్పటికే కొరటాల అండ్ టీం డిస్ట్రిబ్యూటర్లకు చెల్లించారని, కొంతభాగం పెండింగ్ లో ఉందని టాక్. నైజాం హక్కులను కొనుక్కున్న వరంగల్ శ్రీనుకు 20కోట్లపైనే నష్టం వాటిల్లినట్టు తెలుస్తుంది. దీంతో ఆయనకు కొరటాల భారీగా కంపెన్సేషన్ తో పాటు ఇతర హామీలు కూడా ఇచ్చారని అంటున్నారు.
ఆచార్య ఓటిటి రైట్స్ కొనుక్కున్న అమెజాన్ సంస్థ ఇంకా కొంతభాగం మేకర్స్ కు ఇవ్వాలి. చిరు తన రెమ్యునరేషన్ లో పదికోట్లను వెనక్కి ఇచ్చారని అంటున్నారు. అలానే ఆచార్య జీఎస్టీ ఖర్చులను నిరంజన్ రెడ్డి భరిస్తారని మాట ఇచ్చారట. ఇవన్నీ కలుపుకుని డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వాల్సిన మిగిలిన డబ్బును కూడా తిరిగి ఇచ్చేసి ఆచార్య నుండి పూర్తిగా బయటపడాలని కొరటాల ఆలోచిస్తున్నారట.