సోషల్ మీడియా ఖాతాలలో, ప్రముఖ సంస్థల ప్రకటనలలో కనిపిస్తూ కృతిశెట్టి బాగా పాపులర్ అయ్యింది. ఈ క్రమంలో ఆమెకు తెలుగు సినిమా తొలి హీరోయిన్ అవకాశాన్నిచ్చింది. మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ నటించిన ఉప్పెన సినిమాలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకుల గుండెల్లో చిన్నపాటి ఉప్పెననే తీసుకొచ్చింది కృతి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో టాలీవుడ్ ఆమెకు వరస ఆఫర్లనిచ్చింది. ఇప్పటికే కృతి నటించిన శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఇంకా కృతి నుండి రావడానికి రామ్ పోతినేని నటిస్తున్న ది వారియర్, నితిన్ నటిస్తున్న మాచర్ల నియోజకవర్గం, సుధీర్ బాబు నటిస్తున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వంటి చిత్రాలున్నాయి. సూర్య -బాలా కాంబోలో వస్తున్న తమిళ చిత్రంలో కూడా కృతి హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. ఇదే కృతి తొలి తమిళ సినిమా.
తాజాగా కృతిశెట్టి మరో సూపర్ ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ ను కృతి కొట్టేసింది. అరుణ్ మాధేశ్వరన్ డైరెక్షన్లో ధనుష్ ఒక మూవీ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్గా ముందుగా ప్రియాంక అరుళ్ మోహన్ ను ఎంచుకోగా, కాల్షీట్ల ప్రాబ్లెమ్ తో ఆమె తప్పుకుంది. తాజాగా ఆమె స్థానంలో కృతిశెట్టిని తీసుకున్నట్టు తెలుస్తుంది.