టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ డైరెక్షన్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా చిత్రం పుష్ప. రష్మిక మండన్న కధానాయిక. ఎలాంటి బోరింగ్ అంశాలు లేకుండా ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ సినిమా మాస్ ఎలిమెంట్స్, ఎమోషన్స్, స్క్రీన్ ప్లే, స్టోరీ, మ్యూజిక్... ఇలా అన్ని అంశాలలోనూ తనదైన మార్క్ చూపించిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. బాలీవుడ్లో అయితే పుష్ప ఒక సెన్సేషన్. ఎటువంటి ప్రొమోషన్స్ లేకుండా కేవలం మౌత్ టాక్ తో ఈ సినిమా వంద కోట్లు కలెక్ట్ చేసింది.
పుష్ప ఇచ్చిన విజయోత్సాహంతో పుష్ప2 పనులను మొదలెట్టేసాడు సుకుమార్. ఐకాన్ స్టార్ కూడా తన తదుపరి చిత్రంగా ఈ సినిమానే చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే పుష్ప పాన్ ఇండియా ఘనవిజయంతో సీక్వెల్ స్క్రిప్ట్ లో సుకుమార్ కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారని టాక్. అందుకే పుష్ప 2 సెట్స్ పైకి వెళ్ళడానికి ఆలస్యమవుతుంది. స్క్రిప్ట్ విషయంలో ఫైనల్ స్టేజ్ కు వచ్చిన సుకుమార్ అండ్ టీం తాజాగా కీలకపాత్రల్లో నటించబోయే నటీనటుల కోసం ఆడిషన్స్ ను నిర్వహించనున్నారట. జూన్ 10వ తేదీ నుండి మొదలయ్యే ఈ ఆడిషన్స్ ఏకధాటిగా నాలుగు రోజులపాటు జరుగుతాయి. ఆడిషన్స్ బాగా చేసిన వారికే ఆయా పాత్రల్లో నటించే అవకాశం కల్పిస్తారని తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa