శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన "మేజర్" సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. తాజాగా ఇప్పుడు టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈ చిత్రాన్ని వీక్షించారు మరియు మేజర్ టీమ్ ని అభినందించారు. ఈ స్టార్ హీరో ట్విట్టర్ లో ప్యాషన్, ప్రేమ మరియు చిత్తశుద్ధితో నిండిన చిత్రం ఇది. మన హీరో గురించి తెలుసుకోవాలంటే కచ్చితంగా ఈ సినిమాని చూడాలి. టీమ్ మొత్తానికి అభినందనలు మరియు మేజర్ సందీప్ తల్లిదండ్రులకు నా హృదయపూర్వక గౌరవం మరియు ప్రేమ అంటూ ట్వీట్ చేసారు. ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa