తొలి తెలుగు ఓటిటి సంస్థ 'ఆహా'. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ గారు స్థాపించారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, అప్పుడెప్పుడో సమంత హోస్ట్ చేసిన సామ్ జామ్ అనే టాక్ షోకి గెస్ట్ గా విచ్చేయడం తప్ప ఇంకెప్పుడూ చిరు ఆహా ను ప్రమోట్ చెయ్యలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఆహాలో ప్రసారమవుతున్న ఒక ముఖ్యమైన షోకోసం మెగాస్టార్ హాజరుకాబోతున్నారట. ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ ల కన్నా "ఇండియన్ ఐడల్ తెలుగు" అనే సింగింగ్ షో బాగా పాపులరయ్యింది. ఇటీవలే ఈ షోకు నందమూరి బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా హాజరై స్టేజ్ ను దడలాడించారు. ఈ సింగింగ్ షో ఫైనల్ ఎపిసోడ్ ను అందరికి అందుబాటులోకి తెచ్చే విధంగా అల్లు అరవింద్ రూ. 99 ప్లాన్ తీసుకురాబోతున్నట్టు ఈమధ్యనే ప్రకటించారు. అంతేకాకుండా మరొక సర్ప్రైజ్ కూడా ఆడియన్స్ కోసం రెడీగా ఉంది అని చెప్పారు. తాజాగా ఇండియన్ ఐడల్ తెలుగు ఫినాలే కోసం మెగాస్టార్ చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ గా హాజరై విన్నర్ ను ఎనౌన్స్ చేస్తారన్నట్టు టాక్ వినబడుతుంది. ఇదే..అల్లు అరవింద్ చెప్పిన సర్ప్రైజ్ అయ్యుంటుందని అనుకుంటున్నారు. ఇప్పటికే ఆ షోలో పాల్గొంటున్న గాయనీగాయకులు మెగాస్టార్ బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్ ను ఎంచుకుని ప్రాక్టీస్ చెయ్యటం మొదలెట్టారంట. ఒకవేళ నిజంగా ఈ షోకు చిరు గెస్ట్ గా హాజరైతే కొణిదెల మరియు అల్లు అభిమానుల కోపతాపాలు సర్దుమణుగుతాయేమో చూడాలి.
![]() |
![]() |