యాంకర్ అనసూయ భరద్వాజ్, విరాజ్ ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం థాంక్యూ బ్రదర్. జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ హౌస్ లో తొలి సినిమాగా రూపొందించారు నిర్మాతలు మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్ నాధ్ బొమ్మి రెడ్డి. ఈ చిత్రానికి రమేష్ రాపర్తి డైరెక్టర్ గా వ్యవహరించారు. 2021లో విడుదలైన ఈ చిత్రం డీసెంట్ హిట్ అయింది. తాజాగా థాంక్యూ బ్రదర్ దర్శకనిర్మాతల కాంబినషన్లో రెండవ సినిమా రాబోతుంది. ఈ మూవీ టైటిల్ మరియు కాన్సెప్ట్ పోస్టర్ ను హీరో రానా దగ్గుబాటి రిలీజ్ చేసారు. మాయా పేటిక అనే యూనిక్ టైటిల్ తో రిలీజైన కాన్సెప్ట్ పోస్టర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ పోస్టర్ చాలా ట్రిక్కీ గా ఉంది. ఎందుకంటే పోస్టర్ లో చాలా పోర్షన్స్ ఉన్నాయి. ఒక్కోదానికి ఒక్కో యూనిక్ కధ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి సంగీతం: గుణ బాలసుభ్రమణియన్, కెమెరా: సురేష్. మాయాపేటిక చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa