డైలాగులు చెప్పడంలో బాలయ్య రిథమ్ వేరు. వెండితెరకు బాలయ్య అఖండగా నిలిచారు. 14 ఏళ్లకే స్వర్గీయ ఎన్టీఆర్ నట వారసుడిగా సినీరంగ ప్రవేశం చేశారు. నేడు 62వ పుట్టినరోజు చేసుకుంటున్నారు. స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో 1984లో 'మంగమ్మ గారి మనవడు' సినిమాతో తొలి విజయాన్ని అందుకున్నారు. 1991లో సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్‌లో తొలి సైన్స్ ఫిక్షన్ సినిమా ఆదిత్య 369 చేసి ఇండస్ట్రీని షేక్ చేశారు.