ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలయ్య - అనిల్ రావిపూడి సినిమా అధికారిక ప్రకటన

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 10, 2022, 02:27 PM

గోపీచంద్ మలినేని డైరెక్షన్లో నందమూరి నటసింహం బాలకృష్ణ తన 107 వ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. నేడు బాలయ్య పుట్టినరోజును పురస్కరించుకుని NBK 107 చిత్రబృందం అభిమానులకు టీజర్, స్పెషల్ పోస్టర్లతో డబుల్ ధమాకా ఇచ్చాయి. ఈ వీడియో, పోస్టర్లకు ప్రేక్షకాభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇదిలావుంటే, బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్ట్ నుండి ఫస్ట్ బిగ్ అప్డేట్ వచ్చింది. పటాస్, సుప్రీం, ఎఫ్ 2, రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరూ, ఎఫ్ 3 ...ఇలా చేసే ప్రతి సినిమాతో సూపర్ డూపర్ హిట్లు కొడుతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి తో బాలకృష్ణ ఒక సినిమా చెయ్యబోతున్నారు. బాలయ్య కెరీర్ లో 108వ సినిమా ఇది. ఈ సినిమాపై ఎప్పటి నుండో పుకార్లు వినబడుతున్నాయి, ఈరోజు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. గాడ్ ఆఫ్ మాసెస్, రోరింగ్ లయన్ అంటూ బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలను చెప్తూ ఆయనతో దిగిన ఒక ఫోటోను పోస్ట్ చేసి, NBK 108 మూవీని అఫీషియల్ గా ఎనౌన్స్ చేసారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అనిల్ కూడా అంతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో బాలయ్య నడివయసు తండ్రి పాత్రను పోషిస్తున్నాడని, ఆయనకు కూతురిగా హీరోయిన్ శ్రీలీల నటిస్తుందని అనిల్ ఇదివరకే తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన విషయాలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa