బ్లఫ్ మాస్టర్, తిమ్మరుసు, స్కై ల్యాబ్ సినిమాలతో యువనటుడు సత్యదేవ్ తెలుగు ప్రేక్షకుల్లో ఎనలేని అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం గాడ్సే. బ్లఫ్ మాస్టర్ దర్శకుడు గోపీగణేష్ పట్టాభి ఈ సినిమాకు దర్శకత్వం చేస్తున్నారు. జూన్ 17న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో నిన్న రిలీజైన ట్రైలర్ కు వీక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది. సత్యదేవ్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకుల ఎదురుచూపులు మొదలయ్యాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, గాడ్సే నాన్ థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఈ యాక్షన్ థ్రిల్లర్ డిజిటల్ హక్కులు ఐదు కోట్ల భారీ ధరకు ఒక ప్రముఖ ఓటిటి సంస్థ కొనుగోలు చేసిందట. అలానే హిందీ డబ్బింగ్ వెర్షన్ రైట్స్ రూ. 2.20కోట్లకు అమ్ముడయ్యాయని వినికిడి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa