నాని నటించిన కొత్త చిత్రం అంటే సుందరానికి, ప్రపంచవ్యాప్తంగా ఈ రోజే విడుదలైంది. సినిమా ప్రమోషన్స్ లో అంటే సుందరానికి మూవీ టీం మొదటి నుండి వినూత్నంగా ఆలోచిస్తూ, విభిన్నంగా ప్రచారం చేసింది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల ఆసక్తి బాగా పెరిగింది. ఫలితంగా ఈ సినిమాకు ప్రీమియర్ వసూళ్లు బాగానే వచ్చాయని తెలుస్తుంది. ఓవర్సీస్ లో అంటే సుందరానికి మూవీ ప్రీమియర్స్ తో 2 లక్షల డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసినట్టు తెలుస్తుంది. ఈ మేరకు మూవీ టీం అధికారికంగా స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ప్రీమియర్స్ తోనే భారీ నంబర్ ను రాబట్టాడంటే, ఈ వారాంతంలో సుందరం స్పీడుకు అదుపు ఉండదని అనుకుంటున్నారు.
వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నాజిమ్ హీరోయిన్గా నటించింది. వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ మైత్రిమూవీ మేకర్స్ వారు నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa