ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఎమ్మెస్ రాజు డైరెక్టోరియల్ లో రాబోతున్న రెండవ సినిమా 7డేస్ 6 నైట్స్. ఇందులో ఎమ్మెస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నారు. జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం కోసం ఎమ్మెస్ రాజు ప్రచార కార్యక్రమాలను షురూ చేసారు. ఈ క్రమంలో భాగంగా తాజాగా మూవీ ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ ట్రైలర్ లో సుమంత్ లవర్ బాయ్ లుక్ ను పూర్తిగా మార్చేసినట్టు తెలుస్తుంది. గడ్డం పెంచి పూర్తి రఫ్ అండ్ స్టైలిష్ అల్ట్రా మోడరన్ యూత్ గా కనిపిస్తున్నాడు. సుమంత్ తో పాటు ఈ సినిమాలో మెహర్ చాహల్, రోహన్, కృత్తికాశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ట్రైలర్ లో డైలాగులు తక్కువ, ఓన్లీ ఎమోషన్స్..అంతే, సుమంత్ ఒకేఒక్క డైలాగ్ చెప్తాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రెండీగా ఉంది. యువతే లక్ష్యంగా ఈ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తుంది. హైదరాబాద్, ఉడిపి, గోవా, గోకర్ణ, బెంగుళూరు లలో తీసిన విజువల్స్ కొత్తగా, ఫ్రెష్ లుక్ ను తీసుకొచ్చాయి. ఈ సినిమాకు సుమంత్ మరియు రజినీకాంత్ నిర్మాతలుగా వ్యవహరిస్తే, ఎమ్మెస్ రాజు రచయిత - డైరెక్టర్ గా వ్యవహరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa