నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులు శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే తిరుమల మాడ వీధుల్లో వారు చెప్పులు వేసుకుని తిరగడం, ఫొటోషూట్ చేయడంతో వివాదం తలెత్తింది. దీంతో టీటీడీ అధికారులు వారికి నోటీసులు ఇచ్చారు. అయితే తాజాగా దీనిపై క్షమాపణలు చెబుతూ విఘ్నేశ్ శివన్ ఓ లేఖ విడుదల చేశారు. ఆ సమయంలో తమ కాళ్లకు చెప్పులు ఉన్న విషయం గుర్తులేదని, తెలియక చేసిన తప్పుకు క్షమించాలని కోరారు.