పరశురామ్ డైరెక్షన్ లో మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో జూన్ 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా మే 12న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాను 14 రీల్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించారు.