ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి ప్రస్తుతం "చోర్ బజార్" అనే సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆకాష్ సరాసన గెహ్నా సిప్పీ నటించింది. ప్రముఖ నటి అర్చన ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం జూన్ 24, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో ఆకాష్ పూరి మాట్లాడుతూ.. మొదటి పాట విడుదలైనప్పటి నుంచి సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. చోర్ బజార్ సినిమా అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రండి థియేటర్లలో సినిమా చూసి ఎంజాయ్ చేయండి అని ఆకాష్ పూరి ముగించారు. విఎస్ రాజు నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.