చాలా కాలం నిరీక్షణ తర్వాత, అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన బ్రహ్మాస్త్ర నుండి ఈ రోజు అద్దిరిపోయే అప్డేట్ వచ్చింది. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న బ్రహ్మాస్త్ర సినిమాకు సంబంధించి ఈ రోజు ట్రైలర్ రిలీజ్ అయ్యింది. తొలిసారి రణ్ బీర్, ఆలియా కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే ఈ రోజు రిలీజైన ట్రైలర్ అత్యద్భుతంగా సాగింది. ట్రైలర్ చూస్తుంటే, వేరే లోకానికి వెళ్లినట్టు అనిపిస్తుంది. బ్రహ్మాస్త్ర లో రణ్ బీర్ కపూర్, ఆలియాభట్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, బిగ్ బి అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌని రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా నటిస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. తాజాగా రిలీజైన ట్రైలర్ లో షారుఖ్ ఉన్నడంటూ కొంతమంది అభిమానులు రుజువులతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అందులో చాలామంది, త్రిశూలాన్ని పట్టుకుని, జులపాల జుట్టుతో, కండలు తిరిగిన దేహంతో, ముఖం కనిపించకుండా ఉన్న వ్యక్తిని షారుఖ్ అని అంటున్నారు. ఈ వార్తపై చిత్రబృందం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
![]() |
![]() |