బాలీవుడ్ సినీ దిగ్గజం అశుతోష్ గోవారికర్ డైరెక్షన్లో ఆమీర్ ఖాన్ నటించిన సినిమా "లగాన్". క్రికెట్ క్రీడా నేపథ్యంతో ఒక మంచి ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది. 2001లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆల్ టైం ఇండియన్ క్లాసిక్ సినిమాలలో లగాన్ ఒకటి. మదర్ ఇండియా (1957), సలాం బాంబే (1988) చిత్రాల తర్వాత ఆస్కార్ నామినేషన్స్ కు ఎన్నికైన మూడవ భారతీయ చిత్రం ఇదే.
లగాన్ చిత్ర కథ విషయానికొస్తే, గుజరాత్ లోని ఒక మారుమూల గ్రామంలో నివసించే భువన్ (ఆమిర్ ఖాన్)కు అక్కడి బ్రిటిష్ ఆఫీసర్ నుండి ఒక సవాల్ విసరబడుతుంది. తమపై అకారణంగా, అధికంగా వసూలు చేస్తున్న సిస్తు నుండి విముక్తులు కావడానికి ఆ గ్రామ ప్రజలు బ్రిటిష్ వారితో కలిసి క్రికెట్ ఆటలో గెలవాల్సి ఉంటుంది. ఈ సినిమాలో గ్రేసీ సింగ్, రాచెల్ షెల్లీ, రఘుబీర్ యాదవ్, సుహాసిని మూలే, రాజేంద్ర గుప్త తదితరులు నటించారు. నేటితో లగాన్ విడుదలై 21ఏళ్ళు పూర్తవుతుండడంతో, చిత్రబృందమంతా కలిసి ఆమిర్ స్వగృహంలో హాజరై సంబరాలు చేసుకుంటున్నారు.
![]() |
![]() |