గతంలోలా చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం మల్టీస్టారర్ల హావా నడుస్తుంది. ఒక స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తున్నారు. తద్వారా ఆ సినిమాకు రీచ్ ఎక్కువ ఉంటుంది. కోలీవుడ్ లో కూడా మల్టీస్టారర్ల సినిమాలు బాగానే వచ్చాయి. ఉదాహరణకు, డాషింగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ నే తీసుకుంటే, మాస్టర్ సినిమాలో హీరో విజయ్ కు ప్రతినాయకుడిగా విభిన్న నటుడు, హీరో విజయ్ సేతుపతిని రంగంలోకి దించారు. రీసెంట్గా విక్రమ్ సినిమాలో కూడా కమల్ హాసన్ కు విలన్గా విజయ్ సేతుపతిని, ఫాహద్ ఫాజిల్, హీరో సూర్య వంటి భారీ స్టార్ క్యాస్ట్ ను ఉపయోగించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. విక్రమ్ తదుపరి లోకేష్ విజయ్ తో సినిమా చేస్తాడని తెలుసు కదా. ఈ సినిమాలో హీరో విజయ్ కు విలన్గా మరో స్టార్ హీరో ధనుష్ ను రంగంలోకి దించబోతున్నట్టు కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇప్పటికే లోకేష్ ధనుష్ కు కథను వినిపించాడట, తనకు కథ బాగా నచ్చడంతో ధనుష్ ఓకే చెప్పినట్టు టాక్. మరి ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.
![]() |
![]() |