బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ గా, మంచి అభిరుచి గల దర్శకుడిగా కరణ్ జోహార్ కు మంచి పేరుంది. ప్రఖ్యాత ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ అధినేతగా, నిర్మాతగా, డైరెక్టర్ గా, నటుడిగా ...ఇలా ప్రొఫెషనల్ గా సూపర్ సక్సెస్ఫుల్ ఐన కరణ్ జీవితంలో ఒకే ఒక్క లోటుకు మాత్రం తీవ్రంగా విచారిస్తున్నాడట.
కరణ్ జోహార్ వయసు యాభై ఏళ్ళు. ఇటీవలే యాభై ఏళ్ళ పుట్టినరోజును బాలీవుడ్ లో గ్రాండ్ గా జరుపుకున్నాడు. ఇంత వయసొచ్చినా కరణ్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. కానీ, 2015లో సరోగసీ విధానం ద్వారా కవలలకు తండ్రి అయ్యాడు. ఒక ఇంటర్వ్యూలో కరణ్ మాట్లాడుతూ.... జీవితంలో ప్రొఫెషనల్ గా చాలా సక్సెస్ అయ్యాను. కానీ, పర్సనల్ లైఫ్ మీద కూసింత శ్రద్ధ వహించి ఉంటే బావుండేది. జీవిత భాగస్వామి లేకపోవడం అనేది నా జీవితంలో నేను చాలా రిగ్రెట్ గా ఫీల్ అయ్యే విషయం. ఇక, ఈ వయసులో లైఫ్ పార్టనర్ దొరకడం అనేది అసంభవం. జీవితంలో మనల్ని ప్రేమగా చూసుకునే తల్లితండ్రులున్నా, మనం ప్రేమగా చూసుకునే సంతానమున్నా భార్య/భర్త లోటును, ఆ ప్లేస్ ను ఎవరు భర్తీ చేయలేరు. ఆ ప్లేస్ వారికొక్కరికే సొంతం... అంటూ తన బాధను తెలియచేసాడు.
![]() |
![]() |