డస్కీ సైరన్ పూజాహెగ్డే చాలావేగంగా సినిమాలు చేస్తూ, కెరీర్లో వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ రంగాలలో అందరు స్టార్ హీరోలతో రొమాన్స్ చేసిన ఈ ముంబై భామ తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమలో కూడా అడుగు పెట్టబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. అది కూడా పాన్ ఇండియా స్టార్ రాఖీభాయ్ యష్ కు జోడిగా పూజా నటిస్తుందనే వార్తలు ఆమె అభిమానుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ తో ఒకేసారి పూజా డబుల్ ధమాకా కొట్టినట్టే. ఎందుకంటే, పూజా ఇప్పటివరకు కన్నడ లో సినిమాలు చెయ్యలేదు. అలానే కేజీఎఫ్ తో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న రాకింగ్ స్టార్ యష్ కు జోడిగా నటించే బంగారు అవకాశాన్ని కూడా కొట్టేసింది. కేజీఎఫ్ తర్వాత కాస్త టైం తీసుకున్న యష్ నార్తన్ అనే ఫేమస్ కన్నడ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. నార్తన్ 2017లో వచ్చిన మఫ్టీ సినిమా డైరెక్ట్ చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. యష్ కెరీర్లో ఈ సినిమా 19వది. ఈ సినిమాపై, పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుందనే విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
![]() |
![]() |