కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, ఫిమేల్ డైరెక్టర్ సుధా కొంగర కాంబోలో వచ్చిన చిత్రం ఆకాశమే నీ హద్దురా. ఫుల్ కరోనా టైం లో, ఓటిటిలో విడుదలైన ఈ చిత్రానికి నెటిజన్లు బ్రహ్మరధం పట్టారు. విమానయానం చెయ్యాలనేది ప్రతి ఒక్కరికి ఉండే సహజకల. ఈ కలను నిజం చెయ్యాలని, ప్రతి మధ్య తరగతి వ్యక్తి ఆకాశంలో ప్రయాణం చెయ్యాలని నడుం కట్టి పోరాడిన వ్యక్తి జీవిత గాథే సురారై పొట్రు (ఆకాశమే నీ హద్దురా). ప్రస్తుతం ఈ చిత్రాన్ని సుధా కొంగర హిందీలో రీమేక్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. హిందీ సురారై పొట్రులో అక్షయ్ కుమార్, రాధికా మదన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చెయ్యని ఈ మూవీ ముంబైలో సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు, ఈ చిత్రంలో సూర్య క్యామియో రోల్ లో కనిపిస్తారని అంటున్నారు. తన సినిమాలో తానే గెస్ట్ గా కనిపించడం అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి చూడాలి సూర్య ఎలాంటి పాత్రలో కనిపిస్తాడు అనేది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa