జెనీలియా దేశ్‌ముఖ్ గురించి తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవసరం లేదు. బొమ్మరిల్లు, రెడీ, ఆరంజ్ వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది. చాలా కాలం గ్యాప్ తర్వాత ఈ యాక్ట్రెస్ మళ్ళి తెలుగు సినిమాలో కనిపించబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. కర్ణాటక మాజీ మంత్రి అండ్ ప్రముఖ బిజినెస్ మాన్ గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి తొలి చిత్రంలో ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది అని సమాచారం. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జెనీలియా సాఫ్ట్‌వేర్ కంపెనీకి సీఈవో పాత్రలో నటిస్తుందని తాజా సమాచారం. ఈ హై బడ్జెట్ సినిమాలో కిరీటి సరసన శ్రీ లీల రొమాన్స్ చేస్తుంది. కన్నడ స్టార్ డాక్టర్ రవిచంద్ర వి కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa