భారతదేశంలోని ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లలో ZEE5 ఒకటి. ఈ పాపులర్ OTT ప్లాట్ఫారం తాజాగా పోలూరు కృష్ణ దర్శకత్వంలో ఇంటెన్స్ థ్రిల్లర్ అయిన 'రెక్కీ' అనే మరో సిరీస్‌ను ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. క్రైమ్ థ్రిల్లర్ ట్రాక్ లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఈరోజు నుండి OTT ప్లాట్ఫారం ZEE5లో ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రంలో శ్రీరామ్, శివబాలాజీ, ధన్య బాలకృష్ణ, ఆడుకలం నరేన్, ఈస్టర్ నొరోన్హా జీవా, శరణ్య ప్రదీప్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీరామ్ మద్దూరి ఈ సిరీస్ కి సంగీతం అందిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీరామ్ కొలిశెట్టి ఈ సిరీస్ ని నిర్మిస్తున్నారు.