ఛలో, గీతాగోవిందం, సర్కారువారిపాట వంటి సూపర్ హిట్ చిత్రాలతో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా మారిన కన్నడ బ్యూటీ రష్మిక మండన్నా, పుష్ప సినిమాతో ఏకంగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా, నేషనల్ క్రష్ గా అవతరించింది. పుష్ప క్రేజ్ రష్మిక పేరును శ్రీవల్లిగా మార్చేసిందంటే, ఆ సినిమాలో ఆమె పాత్ర ప్రభావం అలాంటిది. పల్లెటూరి గడుసు పిల్లగా, పుష్ప మనసు దోచుకున్న శ్రీవల్లిగా రష్మిక ఆ పాత్రలో ఒదిగిపోయిన తీరుకు జనాలు జేజేలు కొట్టారు. పుష్ప సక్సెస్ కు శ్రీవల్లిగా రష్మిక నటన, గ్లామర్, డాన్స్ కూడా ఒక కారణమని చెప్పాలి. పుష్ప సీక్వెల్ లో కూడా హీరోయిన్ రష్మిక అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఐతే, పుష్ప మొదటి భాగం మొత్తంలో బన్నీ పాత్రతో ట్రావెల్ చేసిన రష్మిక సీక్వెల్ లో మాత్రం పెద్దగా కనిపించదని తెలుస్తుంది. పుష్ప సీక్వెల్ స్క్రిప్ట్ ప్రకారం, మొదటి భాగంలో తన సామ్రాజ్యాన్ని స్థాపించిన పుష్ప, రెండవ భాగంలో తన సామ్రాజ్య విస్తరణను, తనకి అడ్డొచ్చిన వారిని ఎలా ఎదుర్కొన్నాడనే నేపథ్యంలో ఉంటుంది. ఈ మేరకు శ్రీవల్లి పాత్రకు ట్రాజెడీ ఎండింగ్ ఇస్తే, ప్రేక్షకులను ఎమోషనల్ గా టచ్ చెయ్యొచ్చని, ఆ ఎపిసోడ్ సినిమాకు మెయిన్ హై లైట్ గా నిలుస్తుందని సుకుమార్ మాస్టర్ ప్లాన్ వేసాడట. కేజీఎఫ్ 2 లో కూడా ఇలాంటి సన్నివేశమే ఉంటుంది. అదే ఆ సినిమాకు క్లైమాక్స్. ఆ ఎపిసోడ్ ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. ఇప్పుడదే తరహాలో సుకుమార్ కూడా పుష్ప సీక్వెల్ ను తీర్చిదిద్దడం విశేషం. ఆ లెక్కన పుష్ప సీక్వెల్ కూడా సూపర్ హిట్ అవుతుందన్న మాట. కానీ, పాపం శ్రీవల్లి... పుష్ప 1 లో చెంగుచెంగున తిరిగిన అల్లరి శ్రీవల్లి సీక్వెల్ లో మాత్రం లేట్ శ్రీవల్లిగా మారబోతుంది.