హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభాస్, దీపికా పదుకొణె ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం దీపిక అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. ఆమెను ఆసుపత్రిలో చేర్పించి డిశ్చార్జి కూడా చేశారు.ప్రస్తుతం దీపికా ముంబై వెళ్లిందని, ప్రస్తుతం షూటింగ్ ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి. షూట్‌ని హోల్డ్ చేసి, ముందుగా దీపికా సాధారణ స్థితికి వచ్చే వరకు వేచి ఉండమని ప్రభాస్ మేకర్స్‌ని కోరినట్లు సమాచారం. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.