ఒక్క పోస్టర్‌తోనే టాలీవుడ్ మొత్తాన్ని తన వైపు తిప్పేసుకుంది సాక్షి వైద్య. అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న ‘ఏజెంట్’ సినిమా నుంచి ఆదివారం సాక్షి వైద్య లుక్ రిలీజైంది. ఈ పోస్టర్‌లో మత్తెక్కించే కళ్లతో మాయ చేస్తున్న సాక్షిని చూసి ఇప్పుడు సినీ అభిమానులంతా ఫిదా అయిపోతున్నారు. అసలు సాక్షి వైద్య ఎవరు? తన బ్యాక్‌గ్రౌండ్ గురించి సోషల్ మీడియాలో వెతికేస్తున్నారు. నిజానికి ఈ అమ్మడికి ఏజెంట్ పోస్టర్ రిలీజ్ కాకముందు నుంచి కూడా టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. మెగా యువ హీరోలందరూ కూడా ఈమె కోసం పోటీ పడుతున్నారు.
మహారాష్ట్రలోని థానేలో 2000 జూన్ 19న సాక్షి వైద్య జన్మించింది. చదువు పూర్తి కాగానే ఫ్యాషన్ రంగంలోకి వచ్చింది. ముంబైలో ఉండి సినీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే పలు టీవీ యాడ్స్‌లో కూడా నటించింది. ఇలా మోడల్‌గా పాపులారిటీ తెచ్చుకుంటున్న సమయంలోనే ఏజెంట్ చిత్రంలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఇక ఈ సినిమా విడుదల కాకముందే ఈమె గ్లామర్‌కు సినీ ఇండస్ట్రీ ఫిదా అయిపోయింది. ముఖ్యంగా మెగా కంపౌండ్ నుంచి ఈమెకు వరుసపెట్టి అవకాశాలు వచ్చాయట. గరుడ వేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమాలో హీరోయిన్‌గా సాక్షిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కార్తిక్ దండు దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న సినిమాలోనూ సాక్షినే హీరోయిన్‌గా అనుకుంటున్నారు. ఉప్పెన సినిమాతో దూసుకొచ్చిన వైష్ణవ్ తేజ్ తర్వాత సినిమాలోనూ ఈమెనే తీసుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక నాగచైతన్య తర్వాత సినిమాకు కూడా సాక్షినే ఫైనల్ చేయాలని అనుకుంటున్నారట. ఇలా మొత్తానికి ఒక్క సినిమా కూడా విడుదల కాకముందే వరుస అవకాశాలను తెచ్చుకుంటుంది సాక్షి. నిజంగా ఈ ప్రాజెక్టులన్నీ ఒకే అయితే తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ కావడం పక్కా.