సల్మాన్ ఖాన్ .... ఇండియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అతికొద్ది మంది నటుల్లో ఒకరు. ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాలలో కూడా సల్మాన్ స్టైల్ కు ఫ్యాన్స్ ఉన్నారు. నటుడిగా, నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్ గా సల్మాన్ విభిన్న పాత్రలను చాలా చక్కగా పోషిస్తారు. సెన్సేషనల్ రియాలిటీ షో బిగ్ బాస్ హిందీ సీజన్ మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు సల్మానే వ్యాఖ్యాతగా పని చేసారంటే సల్మాన్ వాక్చాతుర్య మహత్యం ఎలాంటిదో క్లియర్గా అర్ధమవుతుంది. ఇంకా బాలీవుడ్ లో జరిగే పలు అవార్డు కార్యక్రమాలకు కూడా సల్మాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంటారు. ఈ ఒక్కో షోలో పాల్గొనటానికి సల్మాన్ రూ. 5కోట్ల వరకు ఛార్జ్ చేస్తారట. సల్మాన్ ను చూసి వేలమంది జనాలు వస్తారు కాబట్టి షో ఆర్గనైజర్లు కూడా సల్మాన్ కోసం భారీ మొత్తాన్ని వెచ్చించి ఆయన్నే వ్యాఖ్యాతగా నియమించుకుంటారు. ఇక, సల్మాన్ ఆస్థాన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ ఒక్కో ఎపిసోడ్ కు సుమారు పాతిక కోట్లు తీసుకుంటారట. టెలివిజన్ చరిత్రలో ఇప్పటివరకు ఇండియాలో ఒక స్టార్ అందుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇదేనంట. ఐతే, సల్మాన్ సంపాదించిన మొత్తంలో అధికశాతం సేవాకార్యక్రమాలకే కేటాయించబడుతుంది.