పంజాబీ బ్యూటీ షెహనాజ్ గిల్ అభి మానులను సపైజ్ చేసింది. పంజాబీ వధువుగా ముస్తాబై ర్యాంప్ నడించింది. అహ్మదాబాద్ నిర్వహించిన ఫ్యాషన్ షోలో ఎంబ్రాయిడరీ చేసిన ఎరుపు మరియు బంగారు లెహంగాను ధరించి షో కోసం షోస్టాపర్‌గా మారింది. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యా యి. షెహనాజ్ అందమైన పెయిటింగ్ గా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. షెహనాజ్ గిల్ మ్యూజిక్ వీడియోస్ కి కేరాఫ్ అడ్రస్. బోలేడు వీడియోలు చేసింది. ఏడాదిలో ఇరవైకి పైనే ఆమె మ్యూజిక్ వీడియోస్ ఉంటాయి. ఇక బిగ్ బాస్ సీజన్-13 తో షెహనాజ్ మరింత పాపులర్ అయింది. అదే సమయంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ కు దగ్గరైంది. వీరిద్దరి మధ్య ఏదో సాగుతుందనే ప్రచారం బాలీవుడ్ లో జోరుగా జరుగుతుంది. అంతేకాదు.. సల్మాన్ తాజా సినిమా 'కభీ ఈద్ కభీ దీపావళిలో ఓ కీలక పాత్ర కోసం గిల్ ఎంపికైనట్టు తెలుస్తోంది.