హరి కొలగాని దర్శకత్వంలో కోలీవుడ్ యాక్ట్రెస్ సాయి ధన్షిక "షికారు" అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసందే. ప్రమోషనల్ కంటెంట్ తో మంచి హైప్ సంపాదించుకున్న ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు లేటెస్ట్ టాక్. ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుండగా కానీ ఈ సినిమా కొన్ని కారణాల వల్ల జులై 1 కి వాయిదా పడినట్లు సమాచారం. ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ మూవీలో అభినవ్ మేడిశెట్టి, తేజ్ కూరపాటి, ధీరజ్ ఆత్రేయ, నవకాంత్, అన్నపూర్ణ, సురేఖా వాణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీ సాయిలక్ష్మి క్రియేషన్స్ బ్యానర్‌పై పిఎస్‌ఆర్ కుమార్ (బాబ్జి) ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa