ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ తెలుగు సూపర్‌స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలనివుంది - రాశి ఖన్నా

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 21, 2022, 01:08 PM

మారుతీ డైరెక్షన్ లో టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాకి 'పక్కా కమర్షియల్‌' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. ఈ యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్‌ మూవీలో గోపీచంద్ సరసన బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో సత్యరాజ్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేష్‌, సప్తగిరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఇప్పుడు పక్కా కమర్షియల్ ప్రమోషనల్ టూర్‌లో భాగంగా, గ్లామర్ బ్యూటీ రాశి మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ ఇంటర్వ్యూ లో ఏ తెలుగు హీరోతో పని చేయాలనుకుంటున్నారు అని అడిగినప్పుడు అవకాశం లభిస్తే, నేను మహేష్ బాబుగారితో కలిసి పనిచేయాలనుకుంటున్నాను అని రాశి చెప్పారు. ఈ ఇంటర్వ్యూ వీడియో క్లిప్పింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పక్కా కమర్షియల్ సినిమా జూలై 1న విడుదల కానుంది. UV క్రియేషన్స్ అండ్ GA2 పిక్చర్స్ ఈ సినిమాని నిర్మించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa