యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త చిత్రం "సమ్మతమే". కొత్త దర్శకుడు గోపినాధ్ రెడ్డి డైరెక్షన్లో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో కిరణ్ కు జోడీగా "కలర్ ఫోటో" ఫేమ్ చాందిని చౌదరి నటిస్తుంది. ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీకి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ ను ముమ్మరం చేసారు. ఈ నేపథ్యంలో గత వారం రోజులనుండి చిత్రబృందం వరస ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ సినిమాపై తగినంత బజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్స్ కూడా సినిమా పట్ల మంచి ఇంటరెస్ట్ ను కలుగజేస్తున్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీ సెన్సార్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ అధికారిక పోస్టర్ ను విడుదల చేసారు. ఈ మేరకు సమ్మతమే మూవీకి సెన్సార్ సభ్యులు యూ/ ఏ సెర్టిఫికెట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సెబాస్టియన్ పీసీ సినిమాతో ఫెయిల్యూర్ ను చవిచూసిన ఈ యంగ్ హీరోకు సమ్మతమే సినిమా హిట్ ఇస్తుందో లేదో చూడాలి మరి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa