కోలీవుడ్ సీనియర్ హీరో ఆర్. మాధవన్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం రాకెట్రి : ది నంబి ఎఫెక్ట్. దర్శకుడిగా మాధవన్ కు ఇదే తొలి సినిమా. రాకెట్ సైంటిస్ట్ నంబి నారాయణ్ ఎదుర్కొన్న ఒక విపరీత పరిస్థితిని ఆధారంగా చేసికొని ఈ సినిమా తెరకెక్కింది. ఇంగ్లీష్, హిందీ, తమిళ భాషలలో జూలై 1న ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సినిమాలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కీలక అతిధి పాత్రలు పోషించారు. ఇందుకుగానూ , షారుఖ్, సూర్య ఇద్దరూ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించారట. అంతేకాక, తమ అసిస్టెంట్లకు, క్యారవాన్ లకు, కాస్ట్యూమ్స్ కు కూడా ఎలాంటి ఛార్జ్ తీసుకోలేదట.
ఇటీవలే ఈ చిత్రం 75వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితమైంది. ట్రైకలర్ ఫిలిమ్స్, వెర్గిస్ మూలాన్ పిక్చర్స్, 27th ఇన్వెస్ట్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa