త్వరలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్ర పెళ్లి పీటలెక్కనుంది. అమెరికాకు చెందిన సింగర్ నిక్ జోనస్ తో గత ఏడాది కాలంగా ప్రియాంక ప్రేమలో మునిగితేలుతోంది. దీంతో ఇవాళ సాయంత్రం ముంబైలో ప్రియాంక, నిక్ తో నిశ్చితార్థం చేసుకోనుంది. అంతేకాదు.. ఈ పార్టీకి ఇప్పటికే.. ఈ బాలీవుడ్ బ్యూటీ అందరికీ ఆహ్వానాలు కూడా పంపినట్లు సమాచారం.
గత కొంతకాలంగా ప్రియాంక పెళ్లి వార్తలపై పుకార్లు షికార్లు చేశాయి. అయితే వీటిపై అందాల భామ నోరు మెదపలేదు. అటు ఆమె కుటుంబసభ్యులు కూడా ఎలాంటి కామెంట్లు చేయలేదు. దీంతో వీటన్నింటికి చెక్ పెట్టేలా... శనివారం కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిక్ తో ప్రియాంక ఎంగేజ్ మెంట్ కానుంది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అనుసారంగానే... ఈ నిశ్చితార్థ కార్యక్రమం జరగనుంది. అయితే ఈ కార్యక్రమానికి ప్రియాంక అత్యంత సన్నిహితుల్ని మాత్రమే ఆహ్వానించింది.
అమెరికాకు చెందిన సింగర్ నిక్ జోనస్ తో గత ఏడాదిగా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోంది ప్రియాంక. ప్రియాంక కన్నా నిక్ పదేళ్లు చిన్నవాడు. కొన్నిరోజుల క్రితం భారత్ కి వచ్చిన నిక్ ముంబై వీధుల్లో ప్రియాంకతో కలిసి చక్కర్లు కొడుతున్నారు. చోప్రా ఫ్యామిలీ మెంబర్స్ ను కలిశాడు. అయితే ప్రియాంక పుట్టినరోజునే వీరిద్దరికీ ఎంగేజ్ మెంట్ అయిపోయిందని అమెరికా మీడియా వెల్లడించింది. అయితే ఇవాళ సాయంత్రం ముంబైలో జరగనున్న పార్టీకి నిక్ కుటుంబసభ్యులు కూడా హాజరుకానున్నారు. వాళ్లు ఇప్పటికే ఇండియాకు కూడా చేరుకున్నారు.
Nick y Priyanka llegando para cenar (17/08) en conjunto de sus padres en el JW Marriot en Mumbai, India #nickjonas #priyankachopra #jonasbrotherschile #jonasbrothers pic.twitter.com/s4BfR534jm
— Jonas Brothers Chile (@JonasBrotherscl) August 18, 2018
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa