గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహ బాలకృష్ణ 'NBK107' సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ జోడిగా నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నట్లు మేకర్స్ తెలియజేసారు. డైరెక్టర్ గోపీచంద్ సోషల్ మీడియాలో థమన్ మరియు ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రితో కలిసి ఉన్న చిత్రాన్ని పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి కొన్ని అద్భుతమైన ట్రాక్‌లను కంపోజ్ చేసినందుకు ప్రముఖ దర్శకుడు థమన్ పై ప్రశంసలు కురిపించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించారు.