సినీ సెలెబ్రిటీ జంటలలో మోస్ట్ బ్యూటిఫుల్, మోస్ట్ అడారబుల్ పెయిర్ సూర్య - జ్యోతిక. ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ లలో ఈ జంటకు భారీ ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వరస షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి, ఈ జంట ఇటీవలే "కోస్టారికా" కు వెకేషన్ కెళ్లారు. అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను, వీడియోలను ఒక రీల్ రూపంలో జ్యోతిక కొంచెంసేపటి క్రితమే సోషల్ మీడియాలో షేర్ చేసింది. అప్పటినుండి ఈ రీల్ తెగ వైరల్ అవుతుంది. ఈ రీల్ లో సూర్య, జ్యోతికలు అన్యోన్యంగా ఉన్న ఫోటోలు ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్నిస్తున్నాయి.
కమల్ హాసన్ నటించిన "విక్రమ్" సినిమాలో రోలెక్స్ గా కనిపించిన సూర్య, ఆ పాత్రతో తన క్రేజ్ ను మరింత పెంచుకున్నాడు. తదుపరి వెట్రిమారన్ తో వాడి వాశల్ చిత్రంలో నటిస్తున్నాడు. హిందీలో అక్షయ్ కుమార్ నటిస్తున్న ఒక సినిమాలో సూర్య అతిధి పాత్ర పోషిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa