టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగచైతన్య తన తదుపరి సినిమాని తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. కమర్షియల్ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాకి టెంపరరీగా 'NC 22' అనే టైటిల్‌ని పెట్టారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రంలో కథానాయికగా బబ్లీ బ్యూటీ కృతి శెట్టిని సెలెక్ట్ చేసినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ తెలుగు-తమిళ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మాస్ట్రో ఇళయరాజా, ఆయన తనయుడు మ్యూజిక్ కంపోజర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాణ సంస్థ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa