దర్శకుడు పా రంజిత్‌తో స్టార్ హీరో విక్రమ్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. డిసెంబర్ 2021లో ప్రకటించబడిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా భారీ స్థాయిలో నిర్మించబడుతుంది అని సమాచారం. ఈ చిత్రాన్ని 3డిలో చిత్రీకరిస్తునట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు. సినిమా ప్రధాన ఫోటోగ్రఫీ జూలై 15, 2022 నుండి ప్రారంభమవుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. స్టూడియో గ్రీన్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ రానున్న రోజులలో వెల్లడి చేయనున్నారు.