ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన సినిమా "దువ్వాడ జగన్నాథం". 2017, జూన్ 23 న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ ఐయ్యింది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించగా, పూజాహెగ్డే కథానాయికగా నటించింది. దేవిశ్రీప్రసాద్ చార్ట్ బస్టర్ సాంగ్స్ అందించారు. ఈ సినిమాలో రావు రమేష్, సుబ్బరాజ్, మురళీశర్మ, చంద్రమోహన్, పోసాని కృష్ణ మురళి వెన్నెల కిషోర్ తదితరులు నటించారు.
నేటితో ఈ చిత్రం విడుదలై ఐదేళ్లు గడుస్తుంది. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ డైరెక్టర్ హరీష్ ఎమోషనల్ ట్వీట్ చేసారు. ఈ సినిమాతో జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలను అందించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియచేసారు. పూజాహెగ్డే, DSP, సినిమాటోగ్రాఫర్ బోస్, దిల్ రాజు...సినిమాకు పనిచేసిన ప్రతిఒక్కరికి శుభాకాంక్షలను తెలియచేసారు. ఈ ట్వీట్ కు బన్నీతో దిగిన రీసెంట్ ఫోటోను జత చెయ్యడంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.