"మేజర్" చిత్రంతో దేశవ్యాప్త సంచలనం సృష్టించాడు టాలీవుడ్ యంగ్ హీరో అడవిశేష్. ఈ సినిమాతో తొలి భారీ మరియు, తొలి పాన్ ఇండియా సక్సెస్ ను అందుకున్నాడు శేష్. ఈ సినిమాకు శేష్ రచయితగా కూడా పనిచేసాడు.
అడవిశేష్ డైరెక్షన్లో రూపొందిన ఒక సినిమా "కర్మ". ఈ సినిమాకు సంబంధించిన ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ను శేష్ అభిమానులతో పంచుకున్నాడు. కర్మ ప్రమోషన్స్ కోసం భీమవరం వెళ్ళినప్పుడు ఒక పెద్దమనిషి ప్రవర్తించిన తీరు శేష్ ను ఆశ్చర్యపరిచిందట. కర్మ ఆడియో సీడీ తో ఆ పెద్ద మనిషి వద్దకు వెళ్ళాడట శేష్. దీంతో సంతోషించిన ఆ పెద్దమనిషి నెమ్మదిగా శేష్ పర్సనల్ విషయాలను అడగడం ప్రారంభించాడట. ఫ్యామిలీ గురించి అడిగినప్పుడు, తన తాతగారు అడవి గంగరాజు అని చెప్పగా, ఆ పెద్దాయన వెంటనే "మీరు రాజులు కాదా" అని అడిగాడట. శేష్ "కాదు" అని చెప్పేసరికి, అప్పటివరకు ఎంతో ఆప్యాయంగా పలకరించిన ఆ పెద్దమనిషి గొంతు ఒక్కసారిగా గంభీరంగా మారిందట. ఈ చేదు జ్ఞాపకాన్ని చెప్పేటప్పుడు శేష్ భావోద్వేగానికి లోనయ్యాడు కానీ, ముఖంపై చిరునవ్వును మాత్రం పోనివ్వలేదు.