తెలుగు సినీ ఇండస్ట్రీలో సినీ కార్మికులు వేతనాలు పెంచాలని సమ్మె చేసారు. అయితే సమ్మె కారణంగా రెండు రోజుల పాటు సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. తాజాగా తెలుగు నిర్మాతల మండలి సభ్యులు గురువారం సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. కార్మికుల వేతనాలు పెంచేందుకు నిర్మాతలు అంగీకరించారు. ఏ మేరకు వేతనాలు పెంచాలనే దానిపై దిల్ రాజు నేతృత్వంలో కో-ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో రేపటి నుంచి సినిమా షూటింగ్‌లు జరగనున్నాయి.