ఆర్ మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. ఈ సినిమాకి ఆర్ మాధవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇస్రో ఇంజనీర్ నంబి నారాయణన్ జీవితం ఆధారణగా తెరకెక్కింది. ఈ సినిమాలో తమిళ్ స్టార్ హీరో సూర్య అతిధి పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసారు చిత్ర బృందం.ఈ సినిమాలో రజిత్ కపూర్, సిమ్రాన్, మిషా ఘోషల్, రవి రాఘవేంద్ర, మురళీధరన్, శ్యామ్ రెంగనాథన్ మరియు కార్తీక్ కుమార్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా జూలై 1న విడుదల కానుంది.